ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విలేజ్ యాక్షన్ డ్రామా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. డిసెంబర్ 6, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. అయితే హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం షూటింగ్ కి చిన్న బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ తో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి ఒక ఫోటోను షేర్ చేయడం జరిగింది. అల్లు అర్జున్ తో ఉన్న సెల్ఫి పిక్ ఫ్యాన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. ఫోటోలో అల్లు అర్హా ను కూడా చూడవచ్చు. మరో రెండు రోజుల్లో బన్నీ ఇండియా కి రానున్నారు. వచ్చిన వెంటనే మిగతా షూటింగ్ పార్ట్ ను పూర్తి చేయనున్నారు. పుష్ప 2 ది రూల్ చిత్రం లో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.