“లక్కీ భాస్కర్” టైటిల్ ట్రాక్ కి డేట్ ఫిక్స్!

మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లక్కీ భాస్కర్. దుల్కర్ సల్మాన్ నటించిన సీతారామం చిత్రంతో తెలుగు ఆడియెన్స్ లో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఇటీవల కల్కి2898ఎడి చిత్రంలో కూడా కీలక పాత్రలో కనిపించారు. ఇప్పుడు ఈ లక్కీ భాస్కర్ పై ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రంలో మరొక బ్యూటీ అయేషా ఖాన్ కూడా కనిపించనుంది.

ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ ను మేకర్స్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. టైటిల్ ట్రాక్ ను జూలై 28 వ తేదీన రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ చిత్రంను సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version