“పూరీ జగన్నాథ్” లెజెండ్ డైరెక్టర్ – హరీష్ శంకర్!

మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తదుపరి టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మిస్టర్ బచ్చన్ చిత్రంలో కనిపించనున్నారు. భాగ్యశ్రీ బోర్సే ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేయగా, సూపర్ రెస్పాన్స్ తో దూసుకు పోతుంది. అయితే ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్ లో మీడియా తో ఇంటరాక్ట్ అయిన హరీష్ శంకర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తను దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ చిత్రం, డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డబుల్ ఇస్మార్ట్ శంకర్ తో క్లాష్ కి రెడీ కావడం పట్ల రెస్పాండ్ అయ్యారు. పూరీ గారితో నేను ఎక్కువ వర్క్ చేసా. పూరీ గారితో నాకు రిలేషన్ ఎక్కువ. ఏ రోజూ కూడా పూరి గారితో కంపేర్ చేసుకునే స్థాయి కాదు నాది. అతను ఇన లెజెండ్ డైరెక్టర్. కొన్ని అనుకోని కారణాల వలన డేట్ క్లాష్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డబుల్ ఇస్మార్ట్ మరియు మిస్టర్ బచ్చన్ చిత్రాలు రెండూ కూడా ఆగస్ట్ 15, 2024 న థియేటర్లలోకి రానున్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రాల పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version