పెళ్లి పై సాయి ధరమ్ తేజ్‌ స్పందన

మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌ తన పెళ్లంటూ వచ్చిన రూమర్స్‌ పై తాజాగా స్పందించారు. ‘ఉషా పరియణం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన సాయి ధరమ్ తేజ్‌, యాంకర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘మీ లవ్‌ గురించి చెప్పండి’ అని అడగ్గా ‘‘వన్‌సైడ్‌ లవ్‌ ఉంది. అటు నుంచి ఎలాంటి స్పందన లేదు అని నవ్వుతూ సాయి ధరమ్ తేజ్‌ చెప్పారు.

అలాగే సాయి ధరమ్ తేజ్‌ ఇంకా మాట్లాడుతూ.. ‘ఒకవేళ ఎవరైనా అమ్మాయి నచ్చి.. మాట్లాడేలోపు ‘మీకు పెళ్లి అయిపోయిందట కదా’ అనే సమాధానం వస్తోంది. నాకు పెళ్లా?అని నేను ఆశ్చర్యపోతే.. మీడియాలో చూశామంటున్నారు’’ అని నవ్వుతూ సాయి ధరమ్ తేజ్‌ చెప్పుకొచ్చారు. ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ… ‘‘నా సినిమాలో ‘నో పెళ్లి’ (సోలో బ్రతుకే సో బెటర్‌) అనే పాట ఉంది తెలుసు కదా’’ అని తెలిపారు.

Exit mobile version