ఇండియన్ 2 ఓటిటి రిలీజ్ మరింత ఆలస్యం…ఎందుకంటే?

యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ఫ్లాప్ గా నిలిచింది. ప్రేక్షకులను అలరించడంలో పూర్తిగా విఫలం అయ్యింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో సిద్ధార్థ్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ లు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం యొక్క డిజిటల్ హక్కులని ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకొని చిత్రాలను ఓటిటి ప్లాట్ ఫామ్ లు తక్కువ ధరలు అందిస్తున్నాయి.

ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ కూడా ఇండియన్ 2 మేకర్స్ తో మరోసారి చర్చించడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అంతకు ముందు నిర్ణయించిన మొత్తం కంటే తక్కువగానే కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంది. దీంతో ఓటిటి రిలీజ్ పై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు అప్పుడే వచ్చే అవకాశాలు లేవని చెప్పాలి. ఈ చిత్రానికి సీక్వెల్ ను కూడా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Exit mobile version