సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా చేసిన గత చిత్రం “జైలర్” తో తాను సెన్సేషనల్ హిట్ ని అందుకున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం తర్వాత తాను గెస్ట్ రోల్ లో “లాల్ సలాం” సినిమా కూడా చేశారు కానీ అది అనుకున్న రీతిలో పెర్ఫామ్ చేయలేదు. దీనితో ఇక తన నెక్స్ట్ సినిమాల కోసమే అంతా ఎదురు చూస్తుండగా ఈ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు టిజి జ్ఞానవేల్ తో చేస్తున్న సాలిడ్ ప్రాజెక్ట్ “వెట్టైయన్” కూడా ఒకటి.
మరి ఇందులో అమితాబ్, రానా లాంటి భారీ తారాగణం చేస్తుండగా దీనిపై భారీ అంచనాలు సెట్ అయ్యాయి. అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ నిజానికి అక్టోబర్ 10 రిలీజ్ కి సిద్ధం చేశారు కానీ ఆ డేట్ లో సినిమా రావట్లేదు అని రజినీకాంత్ నే తెలియజేసారు. కానీ అదే అక్టోబర్ లో సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ మాత్రం ఉందని టాక్ ఉంది. ఇక ఇపుడు ఓ కొత్త డేట్ అయితే వినిపిస్తుంది. దీని ప్రకారం ఈ చిత్రం అక్టోబర్ 31న అలా రావచ్చని లేటెస్ట్ రూమర్స్ వినిపిస్తున్నాయి. దీపావళి కానుకగా మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్లాన్ చేస్తున్నారట. మరి దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.