కోలీవుడ్ స్టార్ అండ్ వెర్సటైల్ హీరో సూర్య హీరోగా దిశా పటాని హీరోయిన్ గా దర్శకుడు శివ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “కంగువా” కోసం అందరికీ తెలిసిందే. సూర్య కెరీర్ లోనే డిడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాగా ఈ చిత్రం కోసం అభిమానులు ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు నుంచో కోలీవుడ్ లో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమాగా దీనిని ప్రొజెక్ట్ చేస్తుండగా ఖచ్చితంగా ఈ చిత్రం అంచనాలు అందుకుంటుంది అని మేకర్స్ అనుకుంటున్నారు.
అయితే ఈ చిత్రం కూడా ప్రెజెంట్ ట్రెండ్ లో భాగంగా రెండు భాగాలుగా వస్తున్నా సంగతి తెలిసిందే. మరి పార్ట్ 2 విషయంలో నిర్మాతలు చేస్తున్న కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. వారు అంటున్న దాని ప్రకారం కంగువా పార్ట్ 2 తో అయ్యితే ఎవరూ క్లాష్ కి వచ్చే సాహసం చెయ్యలేరని ఇప్పుడు నుంచే చెప్పేస్తున్నారు. ఇంకా మొదటి పార్ట్ విడుదలే కాలేదు అయినా కూడా పార్ట్ 2 కి మాత్రం ఎవరు నిలవలేరు అని కామెంట్స్ చేయడం అది వారి కాన్ఫిడెన్సా లేక ఓవర్ కాన్ఫిడెన్సా అనేది అర్ధం కావట్లేదు. మరి ఆ రేంజ్ లోనే సినిమాని తెరకెక్కించారా లేదా అనేది తెలియాలి అంటే ఈ అక్టోబర్ 10 వరకు ఆగాల్సిందే.