2024 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. టోటల్ తెలుగు విన్నర్స్ లిస్ట్ ఇదే.!

మన ఇండియన్ సినిమాకి సంబంధించి ఉన్నటువంటి పలు ప్రముఖ అవార్డ్స్ లో ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ కూడా ఒకటి. మరి దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ అవార్డ్స్ వేడుకలు ఫిల్మ్ ఫేర్ వారు జరపగా ఈసారి మన తెలుగు సినిమాల సంబంధించి 2024 అవార్డ్స్ వేడుక హైదరాబాద్ లో అట్టహాసంగా జె ఆర్ సి కన్వెన్షన్ సెంటర్ లో చేసారు. ఈసారి శోభా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అంటూ చేసిన ఈ ఈవెంట్ లో మన టాలీవుడ్ నుంచి పలు చిత్రాలు, టెక్నీషియన్స్ పలు విభాగాల్లో అవార్డులు గెలుపొందారు. ఇక ఆ జాబితా వివరాలు చూసినట్టు అయితే..

ఉత్తమ చిత్రం: బలగం

ఉత్తమ చిత్రం (విమర్శకులు): సాయి రాజేష్ (బేబీ)

ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)

బెస్ట్ డెబ్యూ డైరెక్టర్: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యువ్ (హాయ్ నాన్న)

మెయిన్ లీడ్ లో ఉత్తమ నటుడు: నాని (దసరా)

ఉత్తమ నటుడు (విమర్శకులు): ప్రకాష్ రాజ్ (రంగ మార్తాండ), నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి)

ప్రధాన పాత్రలో ఉత్తమ నటి (స్త్రీ): కీర్తి సురేష్ (దసరా)

ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబీ)

సహాయ పాత్రలో ఉత్తమ నటుడు (పురుషుడు): బ్రహ్మానందం (రంగ మార్తాండ), రవితేజ (వాల్తేరు వీరయ్య)

సహాయ పాత్రలో ఉత్తమ నటి: రూపా లక్ష్మి (బలగం)

బెస్ట్ డెబ్యూ నటుడు: సంగీత్ శోభన్ (మ్యాడ్)

ఉత్తమ సంగీత ఆల్బమ్: బేబీ (విజయ్ బుల్గానిన్)

ఉత్తమ సాహిత్యం: అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా – బేబీ)

ఉత్తమ నేపథ్య గాయకుడు: శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా – బేబీ)

ఉత్తమ నేపథ్య గాయని: శ్వేతా మోహన్ (మాస్టారు మాస్టారు – సార్)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ (దసరా)

ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తాన్ – దసరా)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొల్లా అవినాష్ (దసరా)

ఇలా పలు భాగాల్లో అయితే ఈ చిత్రాలు మెరిసాయి. మరి అన్నిటిలో ఎక్కువగా దసరా సినిమా కైవసం చేసుకోవడం విశేషం. వీరి అందరికీ మా 123తెలుగు టీం శుభాకాంక్షలు తెలియజేస్తుంది.

Exit mobile version