వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా – రామ్ చరణ్!


కేరళలో జరిగిన విధ్వంసం కారణంగా ఎంతోమంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. ఈ ఘటన పట్ల ఇప్పటికే పలు పరిశ్రమలకు చెందిన ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తూ, తమ వంతు సాయం అందించారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి మరియు రామ్ చరణ్ లు కూడా ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో మాత్రమే కాకుండా, వీరి క్రేజ్ దేశ వ్యాప్తంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

వయనాడ్ ఘటన బాధితుల కోసం వీరిద్దరూ కోటి రూపాయల సహాయం చేశారు. ఈ మేరకు రామ్ చరణ్ సోషల్ మీడియాలో తన విచారం వ్యక్తం చేస్తూ, పోస్ట్ ను షేర్ చేశారు. “గత కొన్ని రోజులుగా ప్రకృతి ప్రకోపానికి కేరళలో జరిగిన విధ్వంసం మరియు వందలాది విలువైన ప్రాణాలను కోల్పోయినందుకు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. వయనాడ్ దుర్ఘటన బాధితులకు నా హృదయం వెల్లివిరుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గారు మరియు నేను కలిసి కేరళ సిఎం రిలీఫ్ ఫండ్‌కి 1 కోటి రూపాయలను బాధితులకు మా మద్దతుగా అందిస్తున్నాము. బాధలో ఉన్న వారందరూ కోలుకోవాలని నా ప్రార్థనలు” అని అన్నారు.

Exit mobile version