మాస్ మహారాజ రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న మిస్టర్ బచ్చన్ చిత్రం షూటింగ్ ను నిన్న పూర్తి చేసుకుంది. లాస్ట్ డే కావడం, అది కూడా ఫ్రెండ్షిప్ డే రోజు అవ్వడంతో టీమ్ అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలను నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలు ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
ముఖ్యంగా డైరెక్టర్ హరీష్ శంకర్ కి రవితేజ ఫ్రెండ్షిప్ బ్యాండ్ ను కడుతున్న ఫోటో అందరినీ ఆకట్టుకుంటుంది. ఒక విధంగా వీరి ఫ్రెండ్షిప్ ఇప్పటిది కాదు. షాక్ చిత్రంతోనే మంచి స్నేహితులు గా మారిపోయారు. మిరపకాయ్ చిత్రంతో వీరిద్దరూ మంచి హిట్ ను అందుకున్నారు. ముచ్చటగా మూడోసారి మిస్టర్ బచ్చన్ తో వీరు బాక్సాఫీస్ ను షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.