“మిస్టర్ బచ్చన్” ట్రైలర్ కి డేట్ ఫిక్స్!


అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మిస్టర్ బచ్చన్ చిత్రం ఆగస్టు 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకి రానుంది. మాస్ మహారాజ రవితేజ ను పర్ఫెక్ట్ మాస్ అవతార్ లో డైరెక్టర్ హరీష్ శంకర్ చూపించినట్లు ఇప్పటికే రిలీజైన టీజర్ మరియు ప్రచార చిత్రాలు వెల్లడించాయి. ఇక అందరి కళ్ళు ఇప్పుడు ట్రైలర్ పై పడ్డాయి. మేకర్స్ తాజాగా మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ను సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఆగస్టు 7 వ తేదీన ట్రైలర్ రిలీజ్ కానుంది. రిలీజ్ చేసిన పోస్టర్ లో హీరో మరియు హీరోయిన్ ఇద్దరూ కౌగలించుకొని ఉన్నారు. పోస్టర్ అభిమానులని విశేషంగా అలరిస్తుంది. మాస్ మహారాజ ను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ లో చూడాలని భావిస్తున్న వారందరికీ ఇది పర్ఫెక్ట్ ట్రీట్ అవుతుంది అని మేకర్స్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా, భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version