దీపు జాను, వైశాలిరాజ్ లీడ్ రోల్స్ లో ఎం.బాలరాజు డైరెక్ట్ చేసిన మ్యూజికల్ ఆల్బం ‘ఫస్ట్ లవ్’. ఇప్పటికే రిలీజైన ఈ ఆల్బం టీజర్ మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేసింది. తాజగా ఈ ‘ఫస్ట్ లవ్’ సాంగ్ ను ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చేతుల మీదుగా లాంచ్ చేశారు.
ఈ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో థమన్ మాట్లాడుతూ.. ”ఫస్ట్ లవ్’ మ్యూజిక్ వీడియో చాలా బ్యూటీఫుల్ గా ఉంది. సాంగ్ లో ఒక అద్భుతమైన కథ చూపించారు. ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. కెమరామెన్ చాలా అద్భుతమైన విజువల్స్ ఇచ్చారు. మధు పొన్నాస్ బ్యూటీఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. సంజీవ్ థామస్, సిద్ శ్రీరామ్ ప్రాణం పెట్టి చేశారు. దీపు, వైశాలి స్క్రీన్ పై గొప్పగా షైన్ అయ్యారు. చివరి నిమిషాలు చూస్తున్నపుడు ఒక లవ్లీ బ్రేక్ వచ్చింది. లాస్ట్ లో హార్ట్ బ్రేక్ అయ్యింది. ఈ ప్రొడక్షన్ నాకు చాలా నచ్చింది. చాలా పాషన్ తో చేశారు. వైశాలి, ఖుషి సినిమాలు గుర్తుకు వచ్చాయి. ఈ ఈవెంట్ కి రావడం చాలా ఆనందంగా ఉంది. ఆల్బం పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.
హీరోయిన్, ప్రొడ్యూసర్ వైశాలి రాజ్ మాట్లాడుతూ.. మా స్పెషల్ గెస్ట్ థమన్ గారికి థాంక్స్. ఆయన చాలా బిజీగా ఉండి కూడా మమ్మల్ని సపోర్ట్ చేయడానికి రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. మేము చాలా కష్టపడి ప్రేమతో ఈ పాట చేశాం. సిద్ శ్రీరామ్ గారికి బిగ్ థాంక్స్.అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. మా సాంగ్ ఇంత అద్భుతంగా రావడానికి సాగర్ గారు చాలా సపోర్ట్ చేశారు. అని అన్నారు
హీరో దీపు జాను మాట్లాడుతూ.. ‘థమన్ గారు ఈ వేడుకకు వచ్చి మా సాంగ్ సైజు పెద్దది చేశారు. డైరెక్టర్, ప్రొడ్యూసర్ గారికి థాంక్యూ వెరీ మచ్. ఈ సాంగ్ క్రెడిట్ అంతా డైరెక్టర్ గారికి దక్కుతుంది. మధు, సంజీవ్ కి థాంక్ యు. ఈ సాంగ్ అందరికీ నచ్చుతుందని, వైరల్ అవుతుందనే నమ్మకం ఉంది.’ అని అన్నారు.
డైరెక్టర్ బాలరాజు మాట్లాడుతూ.. ‘అందరూ సెలబ్రేట్ చేసుకునే చాలా స్పెషల్ ఆల్బం ఇది. దీపు, వైశాలిరాజ్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. వైశాలిరాజ్ చాలా పాషన్ తో ప్రొడక్షన్ చేశారు. సిద్ శ్రీరామ్ కి స్పెషల్ థాంక్స్. మా టీం అందరికీ థాంక్స్.’ అని అన్నారు.