నాచురల్ స్టార్ నాని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రం “సరిపోదా శనివారం” కోసం తెలిసిందే. మరి క్రేజీ అనౌన్సమెంట్ తో మొదలైన ఈ చిత్రం జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో అదరగొట్టింది. ఇలా ఈ చిత్రంపై ఇప్పుడు మంచి బజ్ సంతరించుకోగా కామన్ ఆడియెన్స్ కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రంకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇపుడు తెలుస్తుంది.
ఓవర్సీస్ మార్కెట్ లో సినిమా బుకింగ్స్ పలు చోట్ల మొదలు కాగా అక్కడ రన్ టైం అయితే ఇప్పుడు రివీల్ అయింది. దీనితో ఈ చిత్రం 2 గంటల 35 నిమిషాల అవుట్ పుట్ తో రాబోతుంది అని కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఇండియాలో ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు సో ఇక్కడ కొంచెం మార్పు ఉండొచ్చు లేదా అదే రన్ టైం తో రావచ్చని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ తన సంగీతంతో అందర్నీ ఆశ్చర్యపరుస్తుండగా డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ ఆగస్టు 29న సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతుంది.