అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటించిన లాస్ట్ మూవీ ‘ఏజెంట్’ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అక్కినేని అభిమానులు భారీ నమ్మకాలు పెట్టుకున్నారు. అయితే, ఈ సినిమా వచ్చి ఏడాది దాటినా అఖిల్ తన నెక్ట్స్ ప్రాజెక్టును పట్టాలెక్కించలేదు. దీంతో, అఖిల్ నెక్ట్స్ మూవీ ఎవరితో ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది.
అఖిల్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కనుంది. అనిల్ అనే కొత్త దర్శకుడు ఈ భారీ ప్రాజెక్టును పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందించనున్నారు. ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ కూడా అనుకుంటున్నారట. ఇదిలా ఉండగా, అఖిల్ తదుపరి ప్రాజెక్ట్‌పై ఇప్పుడో ఇంట్రెస్టింగ్ వార్త సినీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.
మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఓ సినిమాలో అఖిల్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అక్కినేని నాగార్జున, నాగచైతన్యలు కలిసి మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ చేయనున్నారట. ఇక ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్‌ను పెట్టాలని మేకర్స్ భావిస్తున్నారట. ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్మెంట్ త్వరలోనే రానుందని తెలుస్తోంది.