తారక్, నీల్ ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్..

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా భారీ చిత్రం “దేవర” నటిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై క్రేజీ హైప్ ఇప్పుడు నెలకొనగా ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ లైనప్ పై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఈ లైనప్ లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో డ్రాగన్(పరిశీలనలో ఉన్న టైటిల్) అనే సినిమా కూడా ఉంది. దీంతో ఈ భారీ సినిమా పై రీసెంట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ బయటకు వచ్చింది.

సినిమా అతి త్వరలో లాంఛ్ కాబోతోంది అని టాక్ రాగా ఇప్పుడు ఈ లాంఛ్ ని మేకర్స్ ఇంట్రెస్టింగ్ గా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏ స్టార్ హీరో సినిమా అయినా అట్టహాసంగా లాంఛ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఈ సినిమాను ఏమాత్రం ఎలాంటి మీడియా హంగామా లేకుండా ప్రైవేట్ గా ప్లాన్ చేస్తున్నారట. ఈ చిత్ర పూజా కార్యక్రమం రామానాయుడు స్టూడియోలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే అఫీషియల్ గా మేకర్స్ నుంచి కన్ఫర్మేషన్ వస్తే తప్ప ఈ లాంఛ్ కి సంబంధించి ఎలాంటి డీటెయిల్స్ బయటకి రావు అన్నట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయనున్నారు.

Exit mobile version