సమీక్ష : సింబా – కాన్సెప్ట్ బాగున్నా కంటెంట్ మాత్రం రెగ్యులరే !

Committie Kurrollu Movie Review in Telugu

విడుదల తేదీ : ఆగస్టు 09, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: అనసూయ, జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్

దర్శకుడు: మురళీ మనోహర్ రెడ్డి

నిర్మాతలు : సంపత్ నంది, రాజేందర్ సంయుక్త.

సంగీత దర్శకుడు: కృష్ణ సౌరభ్

సినిమాటోగ్రఫీ:

ఎడిట‌ర్ :

సంబంధిత లింక్స్: ట్రైలర్

అనసూయ, జగపతి బాబు, కస్తూరీ, దివి, శ్రీనాథ్, కబీర్ సింగ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘సింబా’. సంపత్ నంది, రాజేందర్ సంయుక్త నిర్మాణంలో కొత్త దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి ఈ సింబా సినిమాని తెరకెక్కించాడు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అక్ష(అనసూయ) ఒక బెస్ట్ టీచర్. ఇంట్లో బొద్దింకకు కూడా హాని చేయని శాంతి స్వభావి. మరోవైపు తన భర్తకు యాక్సిడెంట్ లో కాళ్ళు పోవడంతో తనే ఇంటిని నడిపిస్తూ ఫ్యామిలీని ఎంతో ప్రేమగా చూసుకుంటుంది. కానీ, ఒకరోజు రోడ్డు మీద ఒక వ్యక్తిని చూడగానే అనసూయ కళ్ళల్లో ఏదో మార్పు. సడెన్ గా ఆమెలో జరిగిన మార్పు కారణంగా ఆ వ్యక్తిని ఫాలో అయి అతి దారుణంగా చంపేస్తోంది. ఈ కేసుని పోలీసాఫీసర్ అనురాగ్(వశిష్ఠ సింహ), జర్నలిస్ట్ ఫాజిల్(శ్రీనాథ్) విచారణ చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో అక్ష మరో వ్యక్తిని చంపే క్రమంలో ఆమెతో పాటు ఫాజిల్(శ్రీనాథ్) కూడా జాయిన్ అవుతాడు. అతనిలో కూడా సడెన్ గా అదే మార్పు జరుగుతుంది. ఆ తర్వాత వీరిద్దరితో పాటు డాక్టర్ ఇరానీ(అనీష్ కురువిళ్ళ) లో అదే మార్పు వచ్చి.. ఈ ముగ్గురు కలిసి మరో వ్యక్తిని చంపేస్తారు. అసలు ఈ ముగ్గురిలో వచ్చిన మార్పు ఏమిటి ?, ఎందుకు వీరికే తెలియకుండా వేరే వ్యక్తులను చంపుతున్నారు ?, ఈ ముగ్గురికి – పర్యావరణ ప్రేమికుడు పురుషోత్తం రెడ్డి(జగపతిబాబు)కి మధ్య ఉన్న సంబంధం ఏంటి ? అనేది మిగిలిన కథ ?

ప్లస్ పాయింట్స్ :

సెల్యులార్ మెమరీ, బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో వైల్డ్ రివేంజ్ స్టోరీ ప్లేతో సాగిన ఈ సింబా చిత్రంలో మొక్కలు నాటాలి అని పర్యావరణానికి సంబంధించిన ఓ మంచి మెసేజ్ ఉంది. కథలో ఇంట్రెస్ట్ మెయింటైన్ చేసిన విధానం కూడా బాగానే ఉంది. మంచివాళ్ళు గా ఉన్న వ్యక్తులు సడెన్ గా అతి దారుణంగా ఎందుకు హత్యలు చేస్తున్నారు ? అనే కోణాన్ని ఆసక్తికరంగానే ఎస్టాబ్లిష్ చేశారు.

కీలక పాత్రలో అనసూయ ఆకట్టుకుంది. ఇటు ఓ మంచి టీచర్ గా, అటు పలు యాక్షన్ సీన్స్ లో వైల్డ్ గా ఆమె తన నటనతో అదరగొట్టేసింది. జగపతి బాబు పర్యావరణ ప్రేమికుడిగా కొత్తగా నటించారు. జగపతి బాబు ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా ఉంది. ఇక వసిష్ఠ సింహ సీరియస్ పోలీసాఫీసర్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మరో కీలక పాత్రలో కనిపించిన శ్రీనాథ్ కూడా బాగా నటించాడు.

హీరోయిన్ దివి ఆకట్టుకుంది. అనీష్ కురువిళ్ళ పాత్రను డిజైన్ చేసిన విధానం బాగుంది. గౌతమి, కస్తూరిలతో మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. అదేవిధంగా మొదటి సినిమా అయినా దర్శకుడు మురళీ మనోహర్ రెడ్డి తన టేకింగ్ తో  ఆకట్టుకున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ మరియు జగపతి బాబు ట్రాక్, మరియు మెసేజ్ ని డీల్ చేసిన విధానం  మురళీ మనోహర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ బాగున్నా.. అలాగే పర్యావరణానికి సంబంధించిన మంచి మెసేజ్ ఉన్నా.. చాలా సన్నివేశాలు చాలా స్లోగా సాగుతాయి. పైగా రెగ్యులర్ రివెంజ్ స్టోరీ ట్రీట్మెంట్ తోనే సినిమాని నింపడం పూర్తి సంతృప్తిపరంగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ లో చాలా ఎపిసోడ్స్ ను సాగదీయకుండా కుదించి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

అలాగే, సింబా సెకండ్ హాఫ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా సాగదీసినట్టు అనిపిస్తోంది. పైగా ఈ ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సీన్స్ లో కొన్ని సిల్లీగా, లాజిక్ లెస్ గా సాగుతాయి. పర్యావరణం, మొక్కలు గురించి చెప్పిన మ్యాటర్ చాలా బాగుంది కానీ, చూపించిన విధానం, చెప్పిన విధానం మాత్రం బాగాలేదు. ఏదో క్లాస్ పీకినట్టు ఉంటుంది. మొత్తానికి ఈ ఎమోషనల్ రివేంజ్ డ్రామాలో కొన్ని రోటీన్ సీన్స్ ను తీసేసి ఉండి ఉంటే సినిమా చాలా బెటర్ గా ఉండేది.

సాంకేతిక విభాగం :

సినిమాలో చెప్పాలనుకున్న కాన్సెప్ట్ మరియు మెసేజ్ చాలా బాగున్నా.. కథనం ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు కృష్ణ సౌరభ్ సమకూర్చిన పాటలు పరవాలేదు. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ కూడా బాగానే ఉంది. ఈ చిత్ర నిర్మాతలు సంపత్ నంది, రాజేందర్ సంయుక్త పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

తీర్పు :

‘సింబా’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ రివేంజ్ డ్రామాలో.. బయోలజికల్ మెమరీ అనే కొత్త కాన్సెప్ట్ తో పాటు పర్యావరణానికి సంబంధించిన ఓ మంచి మెసేజ్ కూడా ఉంది. అలాగే, కొన్ని యాక్షన్ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. నిర్మాణ విలువలు కూడా సినిమా స్థాయిని పెంచాయి. ఐతే, ఫస్ట్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, కొన్ని లాజిక్ లెస్ అండ్ సిల్లీ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలో కాన్సెప్ట్ అండ్ మెసేజ్ మాత్రమే కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version