మాస్ రాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘మిస్టర్ బచ్చన్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ హైప్‌ని క్రియేట్ చేసింది. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఆడియెన్స్‌న అలరించేందుకు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌ను శరవేగంగా నిర్వహిస్తున్నారు మేకర్స్.
కాగా, ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసిందట. మాస్ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ మూవీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడం ఖాయమని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాను బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘రెయిడ్’కు రీమేక్‌గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిస్టర్ బచ్చన్ చిత్ర రన్‌టైమ్‌ని 2 గంటల 38 నిమిషాలుగా లాక్ చేశారట.
ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా అందాల భామ భాగ్యశ్రీ బొర్సె హీరోయిన్గా నటిస్తోంది. విలక్షణ నటుడు జగపతి బాబు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి.విశ్వ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది.