మ‌హా సంతోషాన్నిచ్చే మైహోమ్ “అక్రిద‌”

Myhome

హైద‌రాబాద్‌లో సుఖ‌సంతోషాల్ని అంద‌జేసే అద్భుత‌మైన‌ ప్రాజెక్టుల్ని నిర్మిస్తార‌న్న ఖ్యాతినార్జించిన మై హోమ్ గ్రూప్ నుంచి జాలువారిన మ‌రో మ‌హ‌త్త‌ర‌మైన ఆకాశ‌హ‌ర్మ్య‌మే మై హోమ్ అక్రిద‌. గ‌చ్చిబౌలి విప్రో స‌ర్కిల్, ఫైనాన్షియ‌ల్ డిస్ట్రిక్టుల‌కు చేరువ‌లోని గోప‌న‌ప‌ల్లిలో, సుమారు 24.99 ఎక‌రాల్లో డిజైన్ చేసిన ప్రీమియం లైఫ్ స్ట‌యిల్ అపార్టుమెంట్స్‌ను జి ప్ల‌స్ 39 అంత‌స్తుల్లో నిర్మిస్తున్నారు. మై హోమ్ అక్రిదాలో మొత్తం వ‌చ్చేవి సుమారు 3780 ఫ్లాట్లు. టూ బెడ్రూమ్ ఫ్లాట్ 1399 చ‌ద‌ర‌పు అడుగుల నుంచి, రెండున్న‌ర ప‌డ‌క గ‌దుల ఫ్లాట్ అయితే 1622 చ‌ద‌ర‌పు అడుగులు, ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్ అయితే 1926, 2012, 2262, 2347 ఎస్ఎఫ్‌టీలో దొరుకుతాయి.

గోప‌న‌ప‌ల్లి ప్రాజెక్టుకు అక్రిద‌ అని పేరు పెట్టింది మై హోమ్. దీనికి అర్థం సెంట‌ర్ ఆఫ్ జాయ్. అంటే, ఇందులో నివ‌సించేవారు ఎప్ప‌టికీ సంతోషంగా, ప్ర‌శాంతంగా నివ‌సిస్తారు. అంతేకాదు, ప్రాజెక్టు ప‌రిస‌రాలు సైతం సంతోష‌క‌ర‌మైన ప్ర‌జ‌లతోనే నిండుతుంది. అందుకే, మై హోమ్ డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును చూస్టే చాలు. మీరు ఒక్క‌సారిగా అక్రిద‌ ప్రేమలో ప‌డతార‌నే విష‌యంలో సందేహం లేదు.

మై హోమ్ అక్రిద‌ ప్రాజెక్టును సుమారు 29.49 ఎక‌రాల్లో రెండు క్ల‌బ్ హౌజుల‌కు మై హోమ్ సంస్థ స్థానం క‌ల్పించింది. మొద‌టి క్ల‌బ్ హౌజ్‌ను యాభై ఎనిమిది వేల చ‌ద‌ర‌పు అడుగుల్లో, జి ప్ల‌స్ 4 అంత‌స్తుల ఎత్తులో డిజైన్ చేసింది. ఇందులో ఆధునిక స‌దుపాయాల‌కు పెద్ద‌పీట వేసింది. రెండో క్ల‌బ్ హౌజ్‌ను 47 వేల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో, జి ప్ల‌స్ 3 అంత‌స్తులో ఎత్తులో నిర్మిస్తోంది. ప‌రిపూర్ణ ప్ర‌శాంత‌తో కూడుకున్న విశ్రాంతిని కావాల‌ని కోరుకునేవారికి మై హోమ్ అక్రిద‌ ప్రాజెక్ట్ నచ్చుతుంది.

Exit mobile version