ఓటిటిలో వచ్చాక “ఇండియన్ 2” కి మరింత దారుణమైన రెస్పాన్స్

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ భారీ చిత్రం “ఇండియన్ 2” కోసం అందరికీ తెలిసిందే. గత జూలై లో రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం షాకింగ్ రెస్పాన్స్ అందుకుంది. దీనితో నెల లోపే ఓటిటిలో రిలీజ్ కి కూడా ఈ చిత్రం వచ్చేసింది. అయితే ఈ చిత్రం సౌత్ భాషల్లో దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా ఇందులో ఈ సినిమా ఇప్పుడు మరింత దారుణమైన రెస్పాన్స్ ని అందుకుంటుంది అని చెప్పాలి.

అప్పుడు థియేటర్స్ లోనే అనుకుంటే ఇప్పుడు ఓటిటిలో అప్పుడు చూడని వారు కూడా చూసి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఇంకా కొన్ని సీన్స్ ని అయితే ఇవి శంకర్ లాంటి దర్శకుడు తీసాడా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఇంట్రెస్టింగ్ గా తమిళ ఆడియెన్సే ఎక్కువగా ఇండియన్ 2 ని ట్రోల్స్ చేస్తుండడం గమనార్హం. ఇందులో సిద్ధార్థ్, రకుల్ ప్రియ భవాని శంకర్ లపై కూడా చేస్తున్నారు. ఇలా ఈ చిత్రం మాత్రం ఓటిటిలో వచ్చాక మాత్రం మరింత దారుణమైన స్పందనని అందుకుంది అని చెప్పాలి.

Exit mobile version