‘రాజ్ త‌రుణ్’ వివాదం పై ఆర్జీవీ కామెంట్స్ వైరల్

‘రాజ్ త‌రుణ్ ప్రేయ‌సి’ లావ‌ణ్య, రాజ్ త‌రుణ్ త‌న‌ను మోసం చేశాడంటూ చేస్తున్న ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. రాజ్ తరుణ్ పేరు మాత్రం నిత్యం వార్తల్లో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా ఈ వివాదంపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన విశ్లేషణ ఇచ్చాడు. ఇంతకీ, ఆర్జీవీ ఏం మాట్లాడాడు అంటే.. ‘నాకు రాజ్ మాత్రమే కావాలంటే అది చాక్లెట్ కాదు కదా. అతడికి ఇష్టం లేనప్పుడు కూర్చొని మాట్లాడుకోవాలి. ఏదో ఒక పాయింట్ దగ్గర అండర్ స్టాండింగ్ కు రావాలి.

11 ఏళ్లు సహజీవనం చేశానంటోంది, పెళ్లి చేసుకొని, 20 ఏళ్లు కాపురం చేసినోళ్లే విడాకులు తీసుకుంటున్నారు. సహజీవనంలో విడిపోవడం అసలు పాయింట్ కాదు.’ అంటూ ఆర్జీవీ కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఆర్జీవీ ఇంకా మాట్లాడుతూ.. ‘రాజ్ తరుణ్ మాత్రమే కావాలని లావణ్య బయటకు చెబుతోంది. కానీ చివరికి ఇదంతా డబ్బుతోనే సెటిల్ అవుతుందని నాకు అనిపిస్తోంది’ అని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు.

Exit mobile version