బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన 77వ లోకార్నో ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్న షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. ‘నేను గతేడాది ‘జవాన్’, ‘డంకీ’ సినిమాల్లో నటించా. అవి మంచి విజయాలు సాధించాయి. ఐతే, అవి పక్కా కమర్షియల్ సినిమాలు. నిజానికి విభిన్న కథాచిత్రంలో నటించాలని నేను ఎన్నో ఏళ్ల నుంచి అనుకుంటున్నాను. అలాంటి సినిమా ఇప్పుడు చేయబోతున్నా.
ఓ సందర్భంలో దర్శకుడు సుజోయ్ ఘోష్‌కు కొత్త కథలు చేయాలని చెప్పా. తన వద్ద అలాంటి కథే ఉందని నాకు ఓ కథ చెప్పారు. అలా ఇప్పుడు మా కాంబోలో ‘కింగ్’ తెరకెక్కబోతుంది. దానికి సంబంధించిన వర్క్ మొదలుపెట్టాలి. ఆ సినిమా కోసం నేను కొంచెం బరువు తగ్గాలి. సన్నబడాలి. ఇది చాలా కష్టతరమైన పని. సినిమాలో నేను చాలా కూల్‌గా కనిపిస్తాను. ఆ సినిమా అదిరిపోతోంది’ అని షారుక్ ఖాన్ చెప్పుకొచ్చాడు.