నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘సరిపోదా శనివారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ 35 MM థియేటర్లో గ్రాండ్‌గా నిర్వహించారు. దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ సినిమా ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రానుందని మేకర్స్ తెలిపారు. ఇక ఈ ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు ఆడియన్స్‌ని కట్టిపడేసింది.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ..‘‘సుదర్శన్ థియేటర్ నాకు చాలా స్పెషల్. మీ అందరితో కలసి ఈ ట్రైలర్ చూడటం చాలా హ్యాపీగా ఉంది. ఈ మంత్ ఎండ్‌కి ఈ సినిమాతో అదరగొట్టేద్దాం. మీ అందరితో కలసి సినిమా ఇక్కడే చూస్తాను. మీ అందరి ప్రేమకి థ్యాంక్స్. మీరు ఇలానే ప్రేమ చూపిస్తూ ఉంటే వందశాతం కష్టపడి మీకు మంచి మంచి సినిమాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తునే ఉంటాను. ఈ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పాలంటే.. ‘నాకు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చిందంటే వీళ్ళు నా మనుషులు.. వాళ్ళ సమస్య నా సమస్య.. వాళ్ళ సంతోషం నా సంతోషం.’ అందుకే ఈ ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక సెలబ్రేట్ చేసుకుంటూనే ఉందాం. థాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 29న ‘సరిపోదా శనివారం’తో థియేటర్స్‌లో సెలబ్రేట్ చేసుకుందాం’’ అని అన్నారు.
విలక్షణ నటుడు SJ సూర్య మాట్లాడుతూ..‘‘మీ అందరినీ కలవడం ఆనందంగా ఉంది. ట్రైలర్‌ని మించి ఈ సినిమా ఉంటుంది. సినిమా సూపర్‌గా వచ్చింది. ఫెంటాస్టిక్ మూవీ. నాని గారు కష్టపడి వచ్చారు. మీ అందరి సపోర్ట్‌తో ఎదిగారు. ఆయన మంచి మనిషి. ఆయన మంచి మనసుకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి. నాని గారు ఈ సినిమాలో శనివారం బాషా. డి.వి.వి దానయ్య గారు చాలా భారీగా ఖర్చు చేసి ఈ సినిమా చేశారు. సోకులపాలెం అనే ఒక ఏరియాని ఫుల్ సెట్లో వేశారు. అది చాలా బాగా వచ్చింది. చాలా మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇది. మంచి ఎనర్జీ ఉన్న సినిమా ఇది. తప్పకుండా పెద్ద హిట్ అవుతుంది’ అన్నారు.
హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ..‘‘చాలా రోజులకి మిమ్మల్ని కలవడం ఆనందంగా ఉంది. నాని గారితో ‘గ్యాంగ్ లీడర్’ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. ఆగస్ట్ 29న అందరూ ఫ్యామిలీతో వెళ్లి సినిమా చూడండి’ అని అన్నారు. నిర్మాత డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ..‘‘సరిపోదా శనివారం సినిమా మైండ్‌బ్లోయింగ్. నాని-సూర్య కెమిస్ట్రీ అదుర్స్. సినిమా బ్లాక్‌బస్టర్’ అని అన్నారు.