టాలీవుడ్ లో ప్రత్యేక చిత్రాలను చేస్తూ, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ యాక్టర్, నాచురల్ స్టార్ నాని. గతేడాది దసరా, హాయ్ నాన్న చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకున్నాడు. ఈ ఏడాది సరిపోదా శనివారం అంటూ ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఆగస్టు 29 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఎస్.జే. సూర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు.
తాజాగా ఈ చిత్రం టీవీ పార్ట్ నర్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు సొంతం చేసుకుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన సరిపోదా శనివారం చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.