ఎలాంటి స్వాతంత్య్రం జరుపుకుంటున్నాం..? – ఉపాసన

యావత్ భారతదేశం నేడు స్వాతంత్య్రం దినోత్సవాన్ని సంతోషంగా జరుపకుంటోంది. మువ్వన్నెల జెండాకు అభివాదం చెస్తూ ఊరువాడ దేశభక్తిలో మునిగితేలుతోంది. అయితే, అసలు మనం ఎలాంటి స్వాతంత్య్రం జరుపుకుంటున్నాం.. అని ఉద్వేగానికి లోనవుతోంది మెగా కోడలు ఉపాసన కొణిదెల.

ఇటీవల కోల్‌కతాలో మహిళా వైద్యురాలిపై జరిగిన హత్యాచార ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వాన్ని అపహాస్యం చేసే ఘటన ఇది. సమాజంలో అనాగరికత పెరిగిపోయిందని.. అసలు మనం ఎలాంటి స్వాతంత్య్రం జరుపుకుంటున్నాం.. దేశ ఆరోగ్య సంరక్షణకు మహిళలే కీలకమని.. అలాంటి వారిపై జరుగుతున్న దాడులు తీవ్రంగా బాధిస్తున్నాయని ఉపాసన ట్వీట్ చేశారు.

ఎక్కువమంది మహిళలను వర్క్‌ఫోర్స్‌లోకి తీసుకురావాలని.. వారికి భద్రతతో పాటు గౌరవం అందించేందుకు అందరం కలిసి కృషి చేయాలని ఆమె ఈ సందర్భంగా తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఉపాసన చేసిన ఈ ట్వీట్ నెటిజన్లను ఆలోచనలో పడేసింది. వారు కూడా సమాజంలో పేట్రేగిపోతున్న అనాగరికతపై సోషల్ మీడియాలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version