లెజెండరీ గాయని పి.సుశీలకు అస్వస్థత

ప్రముఖ లెజెండరీ గాయని పి.సుశీల అస్వస్థత కారణంగా ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. ఆమె గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

అయితే, పి.సుశీల వృద్ధాప్య సమస్యలతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరినట్లుగా తెలుస్తోంది. చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో పి.సుశీల చికిత్స తీసుకొంటున్నారని.. ప్రస్తుతం ఆమె క్షేమంగానే ఉన్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

ఆమె త్వరగా కోలుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని పి.సుశీల అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇక ఆమె తెలుగులోనూ ఘంటసాల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లతో కలిసి ఎన్నో హిట్ పాటలు పాడిన విషయం తెలిసిందే.

Exit mobile version