శ్రీకాంత్ శ్రీరామ్, కుషీ రవి ప్రధాన పాత్రల్లో, సాయికిరణ్ డైడ దర్శకత్వంలో తెరకెక్కిన హార్రర్ థ్రిల్లర్ మూవీ పిండం. గతేడాది థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ గా అయితే డీసెంట్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయిపోయింది.
ఈ చిత్రం యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ అయిన జీ తెలుగు సొంతం చేసుకుంది. వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ పిండం చిత్రం ప్రసారం కానుంది. కలాహి మీడియా పై నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ సౌరభ్ సురంపల్లి సంగీతాన్ని అందించారు. బుల్లితెర పై ఈ చిత్రాన్ని ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.