రీసెంట్ హారర్ సీక్వెల్ కి తెలుగులో ఫస్ట్ ఎవర్ స్పెషల్ ప్రీమియర్ సెట్ చేసారుగా

రీసెంట్ గా కోలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన హిట్ చిత్రాల్లో హారర్ సీక్వెల్ చిత్రం “డిమోంటి కాలనీ 2” కూడా ఒకటి. గత కొన్నేళ్ల కితం వచ్చిన “డిమోంటి కాలనీ” కి హిట్ గా వచ్చిన ఈ హారర్ సీక్వెల్ ని దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించగా తమిళ్ లో ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకొని రన్ అవుతుంది.

ఇక ఈ చిత్రాన్ని తెలుగు డబ్బింగ్ కి గాను సక్సెస్ ఫుల్ నిర్మాణ డిస్ట్రిబ్యూషన్ సంస్థ మైత్రి డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి వారు సొంతం చేసుకోగా వీరు ఈ చిత్రాన్ని గతంలో ఎప్పుడు లేని విధంగా మూడు రోజూ రోజుల ముందే ప్రీమియర్స్ కి తీసుకొస్తున్నారు.

అయితే హైదరాబాద్ లోని బాలానగర్ లో ఉన్న విమల్ థియేటర్ ని వారు కొత్తగా రేనోవేట్ చేయగా అందులో ఈ సినిమాని వారు ఈ మంగళవారం అంటే ఈ ఆగస్ట్ 20 నే ప్రీమియర్ వేసి ఓపెన్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు.

దీనితో జెనరల్ గా గురువారం సాయంత్రం మొదలయ్యే ప్రీమియర్ ని వీరు స్పెషల్ గా మూడు రోజులు ముందే తీసుకొచ్చేస్తున్నారు అని చెప్పాలి. మరి ఈ చిత్రం తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version