ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కన్నడ బ్లాక్‌బస్టర్ మూవీ ‘శాఖాహారి’

కన్నడలో బ్లాక్‌బస్టర్ అయిన ‘శాఖాహారి’ చిత్ర తెలుగు అనువాద హక్కులను హనుమాన్ ప్రొడక్షన్స్ పతాకం పై నిర్మాత బాలు చరణ్ మంచి రేట్‌కి దక్కించుకున్నారు. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉండాలి అని డబ్బింగ్ మీద మంచి శ్రద్ధ పెట్టారు. తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడు అయిన గోపరాజు రమణ చేత హీరో క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పించారు. ఇప్పుడు ఈ ‘శాఖాహారి’ చిత్రం ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది.

సందీప్ సుంకడ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రంగాయన రఘు ప్రధాన పాత్ర పోచించారు. ఇది ఒక మర్డర్ మిస్టరీ కథ. గోపాలకృష్ణ దేశ్ పాండే, వినయ్, నిధి హెగ్డే, హరిణి శ్రీకాంత్ ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. మయూరి అంబేకల్లు అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషించింది.

మంచి క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలు ఇష్టపడే వారికి ఈ ‘శాఖాహారి’ చిత్రం మంచి విందు భోజనం అవుతుందని మేకర్స్ అంటున్నారు. ప్రతి సీన్ ఉత్కంఠభరితంగా ఉంటుందని.. తమ బ్యానర్ నుంచి తెలుగు ప్రేక్షకులకి మంచి చిత్రాలు అందిస్తామని మేకర్స్ తెలిపారు.

Exit mobile version