మెగాస్టార్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌కి మళ్లీ కష్టాలు..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘విశ్వంభర’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు వశిష్ఠ తెరకెక్కిస్తుండగా, పూర్తి సోషియో ఫాంటెసీ మూవీగా ‘విశ్వంభర’ రానుంది. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలను క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్‌గా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మూవీ కొత్త పోస్టర్స్ ఆకట్టుకున్నాయి.

ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అయితే, ఇప్పుడు మెగాస్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి నెట్టింట తెగ చర్చ సాగుతోంది. ఇప్పటికే రచయిత బివిఎస్ రవి నెరేట్ చేసిన ఓ కథకు చిరు ఓకే చెప్పాడని, ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నాడనే టాక్ బలంగా వినిపించింది. అయితే, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుంచి దర్శకుడు మోహన్ రాజా కూడా తప్పుకున్నట్లుగా తెలుస్తోంది.

కొన్ని కారణాల వల్ల ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నాడట. దీంతో చిరు అండ్ టీమ్ ఇప్పుడు మరో దర్శకుడిని వెతికే పనిలో పడ్డారట. ఈ సినిమాను కూడా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించాలని మేకర్స్ భావిస్తున్నారు. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే అఫీషియల్ స్టేట్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version