స్ట్రీమింగ్ పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “డిమోంటి కాలనీ 2”

ఇటీవల కోలీవుడ్ సినిమా దగ్గర వచ్చి మంచి హిట్ అయ్యిన పలు చిత్రాల్లో అవైటెడ్ హారర్ సీక్వెల్ చిత్రం “డిమోంటి కాలనీ 2” కూడా ఒకటి. టాలెంటెడ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ చిత్రంలో అరుళ్ నిథి, ప్రియా భవాని శంకర్ లు లీడ్ రోల్ లో కనిపించగా తమిళ్ లో మంచి హిట్ అయ్యి తెలుగులో ఇప్పుడు రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ చిత్రం ఓటిటి హక్కుల సంబంధించి ఇప్పుడు అప్డేట్ తెలుస్తుంది.

దీని ప్రకారం ఈ చిత్రం తాలూకా ఓటిటి అలాగే శాటిలైట్ హక్కులు కూడా ఒకే సంస్థ తీసుకున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మరి ఈ సినిమాని జీ సంస్థ వారు సొంతం చేసుకున్నారు. శాటిలైట్ హక్కులు జీ ఛానెల్స్ తీసుకోగా స్ట్రీమింగ్ ఈ చిత్రం జీ5 లో కానుంది. సో థియేట్రికల్ రిలీజ్ అనంతరం ఈ చిత్రం వీటిలో రానుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి సామ్ సి ఎస్ సంగీతం అందించగా విజయ సుబ్రమణియన్, ఆర్ సి రాజ్ కుమార్ లు నిర్మాణం వహించగా తెలుగులో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ ఎల్ పి వారు రిలీజ్ చేశారు.

Exit mobile version