మాస్ మహారాజ రవితేజ రీసెంట్ గానే చిన్న ప్రమాదానికి గురయ్యి ఇప్పుడు కోలుకుంటున్న సంగతి తెలిసిందే. మరి దీనికి ముందు ఎంతో ఎనర్జిటిక్ గా ప్రమోషన్స్ లో పాల్గొని రిలీజ్ కి తీసుకొచ్చిన తన కొత్త సినిమానే “మిస్టర్ బచ్చన్”. దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది. ఇలా థియేటర్స్ లో రన్ అవుతున్న ఈ చిత్రం ఓటిటి రిలీజ్ పై ఇప్పుడు బజ్ వినిపిస్తుంది.
దీని ప్రకారం ఈ చిత్రం ఈ రానున్న వినాయక చవితి కానుకగా స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాని దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ సెప్టెంబర్ మొదటి వారం నుంచే స్ట్రీమింగ్ కి వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా ఇపుడు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించగా మిక్కీ జె మేయర్ సంగీతం అందించాడు అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.