చాలా రోజుల తర్వాత మళ్ళీ టాలీవుడ్ లో ఒక సాలిడ్ సినిమా సినిమా అయితే ఎంటర్టైన్ చేసేందుకు వచ్చింది. అదే నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన భారీ చిత్రం “సరిపోదా శనివారం”. టీజర్, ట్రైలర్ లతో ఓ రేంజ్ హైప్ అందుకున్న ఈ చిత్రం ఈ బజ్ నడుమే రిలీజ్ కి వచ్చేసింది.
అయితే టాక్ కూడా ఆడియెన్స్ నుంచి బాగానే రావడంతో నాని మరో హిట్ కొట్టేసినట్టే అని అంతా అనుకుంటున్నారు. అయితే ఈ సినిమా చూసిన వారు అంత ఒక నటుడు పెర్ఫామెన్స్ కోసం బాగా మాట్లాడుకుంటున్నారు. అతడే ఎస్ జె సూర్య. దయా గా ఎస్ జె సూర్య ఓ రేంజ్ లో ఇమిడిపోయాడు అని రీసెంట్ టైం లో ఒక విలన్ ఈ రేంజ్ లో కనిపించడం తన నుంచి చూస్తున్నామని ఆడియెన్స్ అంటున్నారు.
మరి ఇదే మాట నాని కూడా ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. తన కంటే ఎక్కువగా సినిమా చూసాక ఎస్ జె సూర్య గారి కోసం అంతా మాట్లాడుకుంటారని తాను తెలిపాడు. ఇప్పుడు అన్నట్టుగానే ఎస్ జె సూర్య కోసం అంతా మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి అయితే తెలుగులో ఎస్ జే సూర్యకి గ్రాండ్ వెల్కమ్ నటుడిగా దక్కింది అని చెప్పాలి.