“ది గోట్” లో డి-ఏజింగ్ కోసం ఆ సినిమా ఫుటేజ్ ఉపయోగించాం – వెంకట్ ప్రభు


కోలీవుడ్ స్టార్ యాక్టర్ విజయ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ది గోట్. లియో తర్వాత విజయ్ నటించిన చిత్రం కావడంతో సినిమాపై అందరిలో ఆసక్తి నెలకొంది. దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ అందరినీ అలరించింది. ఈ చిత్రంలో హీరో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. డి- ఏజింగ్ టెక్నిక్ ను విజయ్ లుక్ కోసం ఉపయోగించారు. అయితే ఈ కాన్సెప్ట్ కి సంబందించిన ఒక కీలక విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా వెల్లడించారు.

విజయ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన బిగిల్ చిత్రంలోని ఫుటేజ్ ను ఈ చిత్రంలో డి- ఏజింగ్ కోసం ఉపయోగించినట్లు తెలిపారు. ఈ డి ఏజింగ్ కాన్సెప్ట్ పై మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. కల్కి 2898ఏడి చిత్రంలో అమితాబ్ బచ్చన్ లుక్ కోసం ఉపయోగించిన డి-ఏజింగ్ టెక్నిక్ ను ఉపయోగించిన నాగ్ అశ్విన్ టీమ్ పై ఇప్పటికే నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. సెప్టెంబర్ 5 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Exit mobile version