మన టాలీవుడ్ వెర్సటైల్ నటుడు అలాగే నిర్మాత శివాజీ మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తన హిట్ పెయిర్ నటి లయతో శివాజీ తన నిర్మాణం లోనే సినిమా చేస్తుండగా ఆ సినిమా సహా బిగ్ బాస్ ఇంకా తన కెరీర్ పరంగా కొన్ని ఆసక్తికర విషయాలు తాను పంచుకున్నారు. అయితే తన కెరీర్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను కేవలం డబ్బులు కోసమే సినిమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయని శివాజీ తెలిపారు.
అలాగే తన కెరీర్ లో యాంకరింగ్ నటుడుగా అలాగే బిగ్ బాస్ పాలిటిక్స్ వంటి అంశాలు అన్నిటికి సమాన ప్రాధాన్యత ఇస్తాను అని తాను తెలిపారు. ఇక బిగ్ బాస్ విషయానికి వస్తే పల్లవి ప్రశాంత్ అందరితో స్నేహంగా ఉండాలి అని కోరుకుంటాడు అందుకే అతనికి బిగ్ బాస్ లో తన వెనుక ఉన్నాను అని తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు తనకి రహస్యంగా ఆర్ధిక సాయం చేశారు అనే మాట వాస్తవమే అని కూడా తెలిపారు.
ఇక తన కెరీర్ లో అమ్మాయి బాగుంది, మిస్సమ్మ, అదిరిందయ్యా చంద్రం సినిమాలు స్పెషల్ అని అలాగే తన కెరీర్ బిగ్ బాస్ నా 90స్ బయోపిక్ వెబ్ సిరీస్ నా అంటే టక్కున 90స్ వెబ్ సిరీస్ ని ఎంచుకున్నారు. ఇక అలాగే ఇప్పుడు మళ్ళీ లయతో రీ ఎంట్రీపై కామెంట్స్ చేశారు. తమ కాంబినేషన్ లో మూడు హిట్ సినిమాలు వచ్చాయి. అలాగే ఇప్పుడు అనుకున్న స్క్రిప్ట్ కూడా చాలా మంచి స్క్రిప్ట్ అందుకే నటిస్తూ ప్రొడ్యూస్ చేస్తున్నాను అని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.