నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్లతో “సరిపోదా శనివారం”


నాచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, దర్శకుడు వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం చిత్రం థియేటర్లలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం తొలి షో నుండే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం ఇప్పటి వరకూ నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఇది సెన్సేషన్ రెస్పాన్స్ అని చెప్పాలి.

నాని కెరీర్ లో ఇది 10 వ వన్ మిలియన్ డాలర్ చిత్రం. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టనుంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో నటించాడు. జేక్స్ బెజోయ్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించారు.

Exit mobile version