నాచురల్ స్టార్ నాని హీరోగా ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ చిత్రమే “సరిపోదా శనివారం”. మరి మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం క్రేజీ ఓపెనింగ్స్ ని రాబట్టింది. తెలుగు స్టేట్స్ సహా యూఎస్ మార్కెట్ లో కూడా ఈ చిత్రం అదరగొట్టగా ఇక్కడ మాత్రం అన్ స్టాపబల్ గా దూసుకెళ్తుంది అని చెప్పాలి.
అక్కడ లేటెస్ట్ గా చిత్రం 1.1 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసినట్లుగా అనౌన్స్ చేశారు. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. మరి ఈ సినిమాలో ఎస్ జె సూర్య విలన్ గా నటించగా మురళి శర్మ, సాయి కుమార్, అజయ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ చిత్రానికి జేక్స్ బిజొయ్ సంగీతం అందించారు. అలాగే డివివి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.