‘రాజ్ తరుణ్ ప్రేయసి’ లావణ్య, రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ చేసిన ఆరోపణల సంగతి ఎలా ఉన్నా.. రాజ్ తరుణ్ పేరు మాత్రం నిత్యం వార్తల్లో వైరల్ అయింది. ఐతే, తాజాగా లావణ్య వ్యవహారం గురించి రాజ్ తరుణ్ పరోక్షంగా స్పందించాడు. ఓ పాడ్ కాస్ట్ లో ఈ వ్యవహారం గురించి రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘‘నిజం ఏంటనేది నాకు తెలుసు. నా గురించి తెలిసిన వారికి తెలుసు. వంద రకాల సాక్ష్యాధారాలు తీసుకొచ్చి ముందు పెట్టినా.. ఎవరి అభిప్రాయం వారికి ఉంటుంది. వారికి నచ్చింది మాత్రమే వారు నమ్ముతారు. అందుకే, నా వరకు నేను సంతోషంగా ఉన్నానా? లేదా? అనేది నేను చూస్తాను.
ఇక ప్రస్తుతం ఈ విషయం కోర్టులో ఉంది కాబట్టి, నేను అక్కడ నిరూపించుకుంటాను. అందుకు కావాల్సిన సాక్ష్యాలు నా వద్ద ఉన్నాయి. అంతేకానీ, మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. వీళ్లది తప్పు, వాళ్లది తప్పు అని చెప్పడం నాకు నచ్చదు’’ అని రాజ్‌తరుణ్ చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ వివాదం పై రాజ్ తరుణ్ పరోక్షంగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రాజ్ తరుణ్ ప్రస్తుతం ‘భలే ఉన్నాడే’ రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.