అక్కడ నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా “సరిపోదా శనివారం”

నాచురల్ స్టార్ నాని హీరోగా దర్శకుడు వివేక్ ఆత్రేయ కాంబినేషన్ లో తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రం “సరిపోదా శనివారం” కోసం అందరికీ తెలిసిందే. మరి వీరి నుంచి వచ్చిన “అంటే సుందరానికీ” తర్వాత వచ్చిన సినిమా ఇది కావడం అది కూడా ఆ సినిమా రిజల్ట్ కి సమాధానంగా దీనిని ప్లాన్ చేసినట్టుగా తీసుకొచ్చి భారీ హిట్ కొట్టారు.

మరి ఈ చిత్రం ఇప్పుడు ఉన్న హైప్ ని మ్యాచ్ చేస్తూ భారీ వసూళ్లు కొల్లగొడుతుంది. నాని కెరీర్ లోనే మరో సాలిడ్ రన్ ని ఈ చిత్రం నమోదు చేస్తుండగా ఇప్పుడు యూఎస్ మార్కెట్ లో అయితే నాని కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి రికార్డు సెట్ చేసింది. తన గత చిత్రం “దసరా” యూఎస్ మార్కెట్ 2.15 మిలియన్ డాలర్స్ గ్రాస్ తో హైయెస్ట్ గ్రాసర్ గా నిలవగా..

ఇప్పుడు దీనిని సరిపోదా శనివారం 2.05 మిలియన్ డాలర్స్ మార్క్ తో క్రాస్ చేసి హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచి ఇంకా స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. దీనితో ఈ సినిమా నాని కెరీర్ లో మర్చిపోలేని హిట్ గా నిలుస్తుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటించగా ఎస్ జె సూర్య విలన్ గా నటించారు. అలాగే జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా డీవీవీ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

Exit mobile version