“లవ్ గురు” టీవీ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్!


విజయ్ ఆంటోని, మిర్ణాళిని రవి ప్రధాన పాత్రల్లో, దర్శకుడు వినాయక్ వైతినంతన్ దర్శకత్వంలో తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లవ్ గురు. ఏప్రిల్ 11, 2024 న థియేటర్ల లో రిలీజైన ఈ చిత్రం ప్రేక్షకులను అలరించింది. ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా ఈ లవ్ గురు యొక్క శాటిలైట్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. స్టార్ మాలో వచ్చే ఆదివారం సాయంత్రం 6:00 గంటలకు ఈ చిత్రం ప్రసారం కానుంది. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ గా ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.

Exit mobile version