లేటెస్ట్: వరద బాధితులకు మెగాస్టార్ భారీ ఆర్ధిక సాయం

టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ప్రస్తుతం దర్శకుడు “విశ్వంభర” కోసం అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అయితే ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు మూలాన వరదలు ముంచెత్తిన సంగతి తెలిసిందే.

దీనితో టాలీవుడ్ నుంచి అనేకమంది సినీ ప్రముఖులు భారీ మొత్తంలో రెండు తెలుగు రాష్ట్రాల వారికి ఆర్ధిక సాయంగా విరాళాలు తెలుగు రాష్ట్రాల సహాయ నిధికి అందిస్తున్నట్టుగా వెల్లడించారు. అయితే ఇప్పుడు తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా చేరారు. తాను లేటెస్ట్ గా ఈ విషయంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు.

“తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి. మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది. ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాల లో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.” అని ఒక ఎమోషనల్ ట్వీట్ ద్వారా చిరు పెద్ద మొత్తంలో విరాళాన్ని ప్రకటించారు.

Exit mobile version