100 ఏళ్ల ఏఎన్నార్.. మొత్తం 10 క్లాసిక్ హిట్స్ రీరిలీజ్ కి

మన తెలుగు వెండితెర సినిమా దగ్గర ఒక సరికొత్త ట్రెండ్ ని సెట్ చేసిన దిగ్గజ హీరోస్ లో దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. మరి ఏఎన్నార్ తన యుక్త వయస్సు నుంచి తన చివరి సినిమా వరకు అదే ఎనర్జీతో కనిపించి ఆశ్చర్యపరిచారు. మరి తన శత జయంతి సందర్భంగా అక్కినేని వారి నుంచి ఒక క్రేజీ ట్రీట్ సిద్ధం అయ్యింది. ఈ సెప్టెంబర్ 20 నుంచి 22 తేదీలలో మొత్తం 10 క్లాసిక్ చిత్రాలని రీ రిలీజ్ కి తీసుకొస్తున్నారు. ఈ సెప్టెంబర్ 20 కి 100 వసంతాలు పూర్తవుతున్న ప్రత్యేక సందర్భంగా తన కెరీర్ మొదటి నుంచి చివర వరకు మొత్తం 10 ఐకానిక్ సినిమాలు రీరిలీజ్ కి ఇప్పుడు రాబోతున్నారు. మొత్తం 25 సిటీ లలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాలు ప్రదర్శించనున్నారు. మరి ఆ సినిమాలు ఏంటో చూస్తే..

దేవదాసు
మిస్సమ్మ
మాయాబజార్
భార్యాభర్తలు
గుండమ్మ కథ
డాక్టర్ చక్రవర్తి
సుడిగుండాలు
ప్రేమ్ నగర్
ప్రేమాభిషేకం
మనం

ఇలా మొత్తం ఈ 10 క్లాసిక్ సినిమాలు అయితే మళ్ళీ సినిమా అభిమానులని, అక్కినేని అభిమానులని అలరించేందుకు పివిఆర్, ఐనాక్స్ లలో రాబోతున్నాయి. మరి ఈ చిత్రాలు చూడాలి అనుకుంటే ఈ సెప్టెంబర్ 20 వరకు ఆగాల్సిందే.

Exit mobile version