తెలుగు రాష్ట్రాల్లో వరద భీభత్సం సృష్టించి తీవ్ర నష్టాలను మిగిల్చింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ వరద ప్రభావంతో ప్రజలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో అందరూ ముందుకు వచ్చి వరద బాధితులను ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు. సినీ పరిశ్రమ నుంచి కూడా సాయం అందించేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారు.
ఈ క్రమంలో వైజయంతీ మూవీస్ బ్యానర్ నుంచి నిన్న ఏపీ రాష్ట్ర వరద బాధితుల సహాయార్థం ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కి రూ.25 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. తాజాగా తెలంగాణ వరద బాధితులకు అండగా సీఎం రిలీఫ్ ఫండ్‌కు రూ.20 లక్షల విరాళం ప్రకటించారు. దీంతో మరోసారి వరద బాధితులను ఆదుకునేందుకు ముందుకు వచ్చిన వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇక తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఇప్పటికే జూ.ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, అల్లు అర్జున్, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు తమవంతు సాయం అందించి వరద బాధితులకు అండగా నిలిచారు.