ఫోటో మూమెంట్: తన కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేసిన ప్రణీత సుభాష్

టాలీవుడ్‌లో పలు సినిమాలు చేసిన హీరోయిన్ ప్రణీత పెళ్లి, ఆ తరువాత తల్లిగా మారిన తరువాత తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అయితే, ఆమె రెండోసారి గర్భం దాల్చడంతో గతకొంత కాలంగా సినిమాలకు మళ్లీ దూరం అయ్యింది. అయితే, ఆమె తాజాగా ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చినట్లుగా తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో పోస్ట్ చేసింది. దీంతో అభిమానులు ఆమెకు విషెస్ చెబుతున్నారు.

కాగా, తాజాగా ఆమె తన కుమారుడిని ప్రపంచానికి పరిచయం చేసింది. అడ్వెంచర్ మొదలైంది. మా బేబీ బాయ్ వచ్చి కొద్ది రోజులు అవుతోంది. ఈ కొద్ది రోజుల సమయం జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలను మిగిల్చాయని ఆమె తన ఇన్‌స్టా అకౌంట్‌లో పోస్ట్ చేసింది. ఈ సందర్భంగా తన కుమారుడిని ఆప్యాయంగా చేతుల్లో ఎత్తుకుని, తన భర్తతో కలిసి ఉన్న ఫోటోను ఆమె నెట్టింట షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఆమెకు పలువురు స్టార్స్ ఈ సందర్భంగా విషెస్ చెబుతూ సందడి చేస్తున్నారు.

Exit mobile version