తెలుగు రాష్ట్రాల ప్రజలు వరద కారణంగా తీవ్రంగా నష్టపోయారు. ఏపీ, తెలంగాణ ప్రజల వరద కష్టాలను చూసి అందరూ తమకు తోచిన విధంగా సాయం చేసేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగు సినీ పరిశ్రమ నుంచి కూడా పలువురు ప్రముఖులు విరాళం అందిస్తూ తమ ధాతృత్వం చాటుతున్నారు. తాజాగా ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా తనవంతు సాయం అందించి వరద బాధితులకు అండగా నిలిచాడు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు సంయుక్తంగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో రూ.25 లక్షల చొప్పున విరాళం అందించారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తీవ్ర కష్టంలో ఉన్నారని.. వారిని అందరూ ఆదుకోవాలని వారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఇక సినిమాల విషయానికి వస్తే, దిల్ రాజు నిర్మాతగా ప్రొడ్యూస్ చేసిన సినిమా ‘గేమ్ ఛేంజర్’ డిసెంబర్ నెలలో రిలీజ్‌కి రెడీగా ఉంది. ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తుండగా, దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నాడు.
Floods in Andhra Pradesh & Telangana have left devastating after effects.
We at Sri Venkateshwara Creations are pledging ₹25 lakhs each to both states' CM relief funds. Let's stand together in gratitude for the love & support these states have given us.
Raju – Shirish pic.twitter.com/X6SFzd5GGC
— Sri Venkateswara Creations (@SVC_official) September 5, 2024