మన టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. వీటిలో ఈ ఏడాది “కల్కి 2898 ఎడి” అనే గ్లోబల్ రేంజ్ లెవెల్ సినిమాని తాను అందించి తన కెరీర్లో మరో సంచలన విజయాన్ని అందుకున్నాడు. అయితే ప్రభాస్ తన సినిమాలతో పాటు టాలీవుడ్ లో మరిన్ని సినిమాలకి తన సపోర్ట్ ని అందిస్తాడని తెలిసిందే. ఇలా లేటెస్ట్ గా “మత్తు వదలరా 2” సినిమా ట్రైలర్ ని తాను లాంచ్ చేసాడు.
అయితే ఈ లాంచ్ వీడియోకి ప్రభాస్ తో షూట్ చేసిన ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇందులో ప్రభాస్ కామెడీ టైమింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి. నటులు సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా ఇంకా కమెడియన్ సత్య లతో డార్లింగ్ పేల్చిన పంచ్ లు ఫ్యాన్స్ కి ఫీస్ట్ అని చెప్పాలి. ఎన్నో ఏళ్ళు నుంచి ప్రభాస్ నుంచి కోరుకుంటున్న కామెడీ టైమింగ్ కల్కి లో కొంచెం కనిపిస్తే దానికి మించిన కామెడీ టైమింగ్ వీరితో చేసిన వీడియోలో ఉందని చెప్పాలి. మరి ఈ వీడియోని చూడాలి అనుకుంటే ఈ కింద ఉంది చూసెయ్యండి.