‘దేవర’ ప్రమోషన్స్ షురూ.. కపిల్ శర్మ షోలో పాల్గొన్న యాక్టర్స్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దేవర’పై ఎలాంటి బజ్ నెలకొందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ ప్రెస్టీజియస‌గా తీర్చిదద్దాడు. ఇక ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్స్, టీజర్, సాంగ్స్ దుమ్ములేపుతున్నాయి. అయితే, రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్‌ను షురూ చేశారు.

దేవర చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌లోనూ ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దీంతో, అక్కడ ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్‌లు కలిసి ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ షోలో పాల్గొంటున్నారు. తాజాగా దీనికి సంబంధించిన షూట్ ముంబైలో జరుగుతోంది.

నెట్టింట దీనికి సంబంధించి పలు ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక స్టైలిష్ లుక్‌లో దేవర యాక్టర్స్ కనిపించడంతో, ఈ షో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ‘దేవర’ చిత్ర తొలి భాగం సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి రెడీ అవుతోంది.

Exit mobile version