4 రోజుల్లో 288 కోట్లతో “ది గోట్”


కోలీవుడ్ స్టార్ హీరో అయిన విజయ్ ప్రధాన పాత్రలో నటించిన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. ఈ చిత్రం తమిళ భాషలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేవలం 4 రోజుల్లోనే 288 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టింది. అయితే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరించడం లో విఫలం అయ్యింది. నార్త్ అమెరికాలో, తమిళనాడులో సత్తా చాటుతున్న ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో స్నేహ, లైలా, ప్రభుదేవా, ప్రశాంత్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. AGS ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి తమిళనాడులో వస్తున్న రెస్పాన్స్ పట్ల మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version