నేను చూసిన తొలి తెలుగు చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి – టొవినో థామస్


టోవినో థామస్ ప్రధాన పాత్రలో, దర్శకుడు జితిన్ లాల్ దర్శకత్వంలో తెరకెక్కిన A.R.M చిత్రం సెప్టెంబర్ 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రాబోతుంది. మ్యాజిక్ ఫ్రేమ్స్ మరియు UGM ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మించిన ఈ చిత్రం రిలీజ్ కి దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేసారు. ఈ చిత్రాన్ని తెలుగులో కూడా రిలీజ్ కి ప్లాన్ చేయడంతో, ఒక ఈవెంట్ ను ప్లాన్ చేశారు.

ఈ ఈవెంట్ లో హీరో టొవినో థామస్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. తను చూసిన తొలిచిత్రం మెగాస్టార్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి అని తెలిపాడు. తను తెలుగు చిత్రాలు చూస్తా అని అన్నాడు. అంతేకాక బన్నీ చిత్రాలు కూడా చూస్తా అని, అతను నటించిన ఆర్య చిత్రం చూసినట్లు తెలిపాడు. అంతేకాక త్వరలో తెలుగులో ఒక స్ట్రెయిట్ ఫిల్మ్ చేయనున్నట్లు వెల్లడించాడు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కృతి శెట్టి, ఐశ్వర్య రాజేష్, సురభి లక్ష్మీ, బసిల్ జోసెఫ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ధిబు నినన్ థామస్ సంగీతం అందించాడు.

Exit mobile version