తన ముగ్గురు దర్శకులతో తారక్ మాస్ ఫ్రేమ్.. కలయిక ఇందుకే?


ప్రస్తుతం మన టాలీవుడ్ నుంచి రిలీజ్ కి రాబోతున్న అవైటెడ్ భారీ చిత్రం “దేవర” కోసం అందరికీ తెలిసిందే. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో చేస్తున్న రెండో భారీ సినిమా ఇది కాగా దీనిపై సెన్సేషనల్ హైప్ అయితే నెలకొంది. ఇక ఈ చిత్రం తర్వాత తారక్ మరిన్ని భారీ ప్రాజెక్ట్ లు చేస్తుండగా ఈ ప్రాజెక్ట్స్ లో సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ అలాగే తన బాలీవుడ్ డెబ్యూ చిత్రం “వార్ 2” దర్శకుడు అయాన్ ముఖర్జీతో కూడా చేస్తున్నాడు.

మరి ఈ ముగ్గురుతో కలిసి తారక్ కనిపించిన ఒక మాస్ ఫ్రేమ్ కేజ్రీగా మారింది. దీనితో తారక్ నుంచి రానున్న రోజుల్లో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసే ఫ్రేమ్ ఇది అంటూ అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. అయితే ఓ క్రేజీ కలయిక ఎందుకో అనేది ఇప్పుడు తెలుస్తుంది. లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ ముగ్గురు దర్శకులతో కలిసి తారక్ ఓ ఇంటర్వ్యూలో కనిపించబోతున్నాడు అని అందుకే వీరు కలిసినట్టుగా తెలుస్తుంది.

మరి దీనిపై అధికారిక క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇక దేవర ఓ పక్క యూఎస్ మార్కెట్ లో ఆల్ టైం రికార్డు బుకింగ్స్ ని నమోదు చేస్తుండగా ఈ సెప్టెంబర్ 27 పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కి రాబోతుంది. అలాగే జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version