“దేవర” ట్రైలర్ ఏమో కానీ.. అసలు బ్లాస్ట్ ముందుంది

 

ప్రస్తుతం టాలీవుడ్ మొత్తాన్ని మ్యాన్ మాసెస్ ఎన్టీఆర్ అవైటెడ్ సినిమా “దేవర” ఫీవర్ కమ్మేసింది అని చెప్పాలి. గత కొన్ని రోజులు నుంచి దేవర మేనియానే టాలీవుడ్ లో కనిపిస్తుండగా ఇప్పుడు ట్రైలర్ విషయంలో అభిమానులు ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు చాలా మంది ట్రైలర్ ఇంకా కొన్ని ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసమే మాట్లాడుతూ బిజీగా ఉన్నారు కానీ అసలు బ్లాస్ట్ సినిమా రిలీజ్ కి ముందు ఇంకొకటి ఉందని చెప్పాలి.
అదే ఈ సినిమా తాలూకా ప్రీరిలీజ్ ఈవెంట్. దాదాపు ఐదేళ్ల తర్వాత తారక్ నుంచి వచ్చిన సోలో సినిమా ఇది పైగా సంగీత దర్శకుడు అనిరుద్. ఇక ఇలాంటి కాంబినేషన్ లో ఒక అవుట్ డోర్ ప్రీ రిలీజ్ అంటే ఆ తుఫాన్ ఎలా ఉంటుందో ఊహించొచ్చు. అనిరుద్ లైవ్ పెర్ఫామెన్స్ లకి భారీ క్రేజ్ ఉంది. దానికి తోడు ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ కలిస్తే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ మేనియా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.
Exit mobile version